- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
PM Modi: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి అభినందనలు తెలుపిన ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా(US President election) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలుపొందారు. ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్కు 270. కాగా.. ట్రంప్ మెజారిటీ మార్కుని దాటి 277 ఓట్లను సాధించారు. దీంతో ట్రంప్‌నకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) కూడా డొనాల్డ్ ట్రంప్‌ని అభినందిస్తూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. చరిత్రాత్మక విజయం పొందిన నా మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ‘చరిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు. మీ గత పదవీకాల విజయాలకు అనుగుణంగా.. భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నా. మన సంబంధాల మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నేను ఎదురుచూస్తున్నాను. ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు, ప్రపంచ శాంతి, సుస్థిరత్వం కోసం కలిసి పనిచేద్దాం’ అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కు గతంలో పలు వేదికల్లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను మోడీ పంచుకున్నారు.
Read More..
Modi - Trump: ‘నాటు నాటు పాట’కు ప్రధాని మోడీ, డొనాల్డ్ ట్రంప్ డాన్స్ (వీడియో)