- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bhatti : రాజ్యాంగ లక్ష్యాల సాధనకే కుల గణన : భట్టి
దిశ, వెబ్ డెస్క్: రాజ్యాంగ లక్ష్యాల(Constitutional Objectives) సాధన కోసం అందరికి సమాన అవకాశాలు..అందరికి రాజకీయ, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించేందుకే తెలంగాణ ప్రభుత్వం కుల గణన(Caste enumeration) ప్రక్రియను చేపట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు రేషన్ కార్డులు, పింఛన్లలో కోత పెట్టడానికే కుల గణన సర్వే చేపట్టారన్న విపక్షాల విమర్శలు అవాస్తమని కొట్టిపారేశారు. రాష్ట్ర సంపద అందని వారందరికి సంపదను అందించే కార్యక్రమమే కులగణనగా చెప్పుకొచ్చారు. కుల గణనపై ఎన్నికలకు ముందే.. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ ఎన్నికల్లో ప్రచారం చేశారన్నారు. కుల గణనతో వనరులు, ఆస్తులు సమానంగా అందాలన్నదేది తమ విధానమని, అయినప్పటికి కొద్ది మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారికి మాత్రమే ఫలాలు అందాలని అనుకునే వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సమగ్ర సమాచారం వస్తే.. సంపద ఇంకా ఎంత మందికి అందలేదు అనేది తెలుస్తుందని చెప్పారు.
రాజకీయ అవకాశాలు అందాయా..? ఎలాంటి అవకాశాలు వచ్చాయి అనేది సర్వేలో తేలుతుందని స్పష్టం చేశారు. త్వరగానే కుల గణన సర్వే నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. సర్వేలో సేకరించబడిన సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదన్నారు. సర్వే కుల వివాదాలను రగిలిస్తుందన్న ఆరోపణలు అర్ధరహితమని, తెలంగాణ కుల గణన దేశానికి దిక్సుచీ వంటిదని, రోల్ మోడల్ అని ఇప్పటికే రాహుల్ గాంధీ సైతం చెప్పారన్నారు. డెడికేటెడ్ కమిషన్ పని స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిందని, కుల గణన ప్రక్రయ సమగ్ర కుటుంబ సర్వే అని భట్టి వివరించారు. బీహార్ లో కులగణన ప్రక్రియ సత్ఫలితాలిచ్చిందా లేదా అన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమన్నారు. బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే లెక్కలకు కాలం చెల్లిపోయిందని, అందులోని సర్వే అంశాలు..కుల గణన సర్వే అంశాలు భిన్నమైనవన్నారు.