- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెర్వుగట్టులో కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు
దిశ ,నార్కట్ పల్లి : ప్రముఖ క్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ పూర్ణకుంభంతో ఆలయ ఈవో నవీన్ కుమార్ స్వాగతం పలికారు. గృహాలయంలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ దంపతులకు..ఆలయ మర్యాదల ప్రకారం స్వామివారి చిత్రపటాన్ని అందజేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం దేవాలయ మహా మండపంలో ఘనంగా సత్కరించారు . ఈ సందర్భంగా దేవాలయ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ భక్తుల మౌలిక వసతులు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా దేవాలయ విశిష్టతను తెలుసుకొని భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఆమె వెంట జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ అన్నెపర్తి సులోచన, స్థానికులు నేతగాని కృష్ణ, రేగట్టే నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.