- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kodanda Reddy: ఎమ్యెల్యే స్వార్థం కోసం త్రిబుల్ఆర్ అలైన్మెంట్‌లో మార్పు: కోదండ రెడ్డి
దిశ,భువనగిరి రూరల్ : ఎమ్మెల్యేల భూములకు ధరలు పెంచుకోవడం కోసమే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడం జరిగిందని కాంగ్రెస్ ఆల్ ఇండియా కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు.గురువారం నాడు జైలు నుండి బెయిల్ పై విడుదలైన రాయగిరి రైతులను యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు.అనంతరం మాట్లాడుతూ త్రిబుల్ అర్ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు తోడు దొంగలని, రైతులకు బేడీలు వేసి కేసీఆర్ పండుగలు చేసుకుంటున్నాడని ఆయన ధ్వజమెత్తారు.
కోదండ రెడ్డి మాట్లాడుతూ రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు అవసరం లేదని అన్నారు. మోటకొండూరు నుంచి వెళ్లాల్సిన త్రిబుల్ అర్ రోడ్డు ఎమ్మెల్యేల భూములకు ధరలు పెంచుకోవడానికి మాత్రమే అలైన్మెంట్ మార్చారని కోదండ రెడ్డి విమర్శించారు. ఎవరికి బేడీలు వెయ్యొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన రైతులకు సంకెళ్లు వేశారని మండిపడ్డారు. రైతుల మీద పెట్టిన కేసులను వెంటనే విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు.