దళితులను పట్టించుకోని చైర్మన్ రజని

by Naresh |
దళితులను పట్టించుకోని చైర్మన్ రజని
X

దిశ, తుంగతుర్తి: తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్‌గా కొనసాగిన కాలంలో పోతరాజు రజని ఏనాడు కూడా దళితులను పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ ప్రెస్ ఇన్చార్జి కందుకూరు లక్ష్మయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన తిరుమలగిరి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రజిని నాలుగేండ్లు మున్సిపల్ చైర్ పర్సన్‌గా కొనసాగారని పేర్కొన్నారు. ముఖ్యంగా దళిత బంధుపై విచారణ జరిపించాలంటూ రజని చెప్పుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. విచారణలో దోషులు ఎవరనేది కచ్చితంగా బయటపడతారని స్పష్టం చేశారు. స్థాయిని మించి ఎమ్మెల్యే మందుల సామేలు పై విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సామేల్ ప్రజల మనిషిని, అందుకు ఉదాహరణే ప్రజలు 50 వేల పైచిలుకు మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యంగా గత ఎమ్మెల్యే పై విమర్శలు చేసి మళ్లీ ఆయన చెంతకు చేరిన చరిత్ర ఆమెకే ఉందని అన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రజని మళ్లీ కౌన్సిలర్‌గా గెలవలేరని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed