చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు

by Naveena |
చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు
X

దిశ, మిర్యాలగూడ : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని రకాల వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ మండలం అవంతిపురం మార్కెట్ యార్డులో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిబంధనలు ప్రకారం ధాన్యం తీసుకొచ్చి, ప్రతి రైతు మద్దతు ధర పొందాలని సూచించారు. సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన.. ప్రకారం 17% మాయుచర్ ధాన్యానికి క్వింటాల్కు 2320 రూపాయలతో పాటు 500 రూపాయల బోనస్ కలిపి 2830 రూపాయలు చెల్లించనున్నట్లు తెలిపారు. కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే సన్నధాన్యానికి బోనస్ లభిస్తుందన్నారు. రైస్ మిల్లులో విక్రయాలకు బోనస్ వర్తించదని ప్రతి ఒక్క రైతుకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం కొనుగులుపై సీఎం, మంత్రులు నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం 156 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఉత్పత్తిని బట్టి మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తహసిల్దార్ హరిబాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని రకాల వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed