- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mulugu: నెరవేరిన మల్లంపల్లి ఆకాంక్ష.. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా ములుగు మండలంలోని మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా గుర్తించాలంటూ జేఏసీ, మండల సాధన సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేపట్టారు. ఏళ్ల తరబడి సాగిన ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎట్టకేలకు మల్లంపల్లి మండలాన్ని చేస్తూ గురువారం జీవో జారీ చేసింది. గ్రామ ప్రజల ఆకాంక్ష మేరకు మల్లంపల్లిని మండలంగా ప్రకటించడంతో ప్రజలు సంబరాల్లో మునిగితేలారు.
2014 నుంచి మల్లంపల్లి మండలం ఆకాంక్ష..
తెలంగాణ ఉద్యమం ముగిసిన వెంటనే మల్లంపల్లి మండలం ఏర్పాటు కోసం 2014 నుంచి మాజీ సర్పంచ్ గోల్కొండ రవి, చందకుమార్ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగాయి. స్థానిక యువకులు మల్లంపల్లి మండల సాధన సమితి పేరుతో కమిటీ గా ఏర్పడి గోల్కొండ రాజును అధ్యక్షుడిగా ఎన్నుకొని మండల ఏర్పాటు కోసం పోరాటాన్ని ప్రత్యేకంగా ప్రారంభించారు.
మల్లంపల్లి మండల సాధనకు ఉద్యమాలు..
మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 2019 ములుగు ప్రజా ఆశీర్వాద సభలో మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మండల సాధన సమితి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా మండలాల జాబితాను విడుదల చేసినప్పుడు ఆ జాబితాలో మల్లంపల్లి పేరు లేకపోవడంతో సాధన సమితి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. 100 రోజులు నిరసన కార్యక్రమాలు చేపటటారు. రాస్తారోకోలు, ధర్నాలు ,ర్యాలీలు,వంటా వార్పు, కలెక్టరేట్ ముట్టడి,అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు.
జేడీ పేరుతో మండలం పేరు..
ములుగు జిల్లా ఇన్చార్జి జెడ్పీ చైర్మన్గా గతంలో కొనసాగిన మల్లంపల్లి వాస్తవ్యుడైన కుసుమ జగదీశ్వర్ మండల ఏర్పాటు కోసం పరితపించారు. చివరకు అంతిమ ఫలితం చూడలేకపోయాడు. గుండెపోటుతో కుసుమ జగదీశ్వర్ మరణించడంతో మల్లంపల్లిని జేడీ మల్లంపల్లి గా మండలంగా ప్రకటించాలని కోరారు. మంత్రి సీతక్క సైతం హామీ ఇచ్చారు.
మంత్రి సీతక్క మేలు మర్చిపోరు..
సీతక్క సాధన సమితి ఉద్యమానికి పూర్తి మద్దతును ఇవ్వడమే కాకుండా అసెంబ్లీలో సైతం తన గొంతు ఎత్తి ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న సీతక్క అదే స్థాయిలో ప్రైమరీ గెజిట్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి ఇచ్చిన మాట కోసం మండలాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క చేసిన మేలు మల్లంపల్లి గ్రామస్తులు మరువలేరని మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు అన్నారు.
జేడీ మల్లంపల్లిగా పేరు పెడతాం..
ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడవక ముందే మల్లంపల్లి మండలం ప్రకటించాం. సంపూర్ణ గెజిట్ విడుదల చేశాం. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మండలం ప్రకటించారు. త్వరలోనే 400 ఎకరాల భూమి సేకరించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జెడ్పీ చైర్మన్ జగదీష్ పేరుతో జేడీ మల్లంపల్లిగా నామకరణం చేస్తామని మంత్రి సీతక్క అన్నారు.