Kim Jong Un : ఉక్రెయిన్‌ను ఉసిగొల్పుతున్నారు.. ఆత్మరక్షణ కోసం రష్యా దాడి చేయొచ్చు : కిమ్‌

by Hajipasha |
Kim Jong Un : ఉక్రెయిన్‌ను ఉసిగొల్పుతున్నారు.. ఆత్మరక్షణ కోసం రష్యా దాడి చేయొచ్చు  : కిమ్‌
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా, దాని మిత్రదేశాలపై ఉత్తరకొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un) విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘‘లాంగ్ రేంజ్ మిస్సైళ్లను అందించి ఉక్రెయిన్‌‌(Ukraine)ను పశ్చిమ దేశాలు రెచ్చగొడుతున్నాయి. రష్యా(Russia)పైకి ఉసిగొల్పుతున్నాయి. ఇలాంటప్పుడు ఆత్మ రక్షణ కోసం రష్యా ఎదురుదాడి చేయొచ్చు’’ అని కిమ్ వ్యాఖ్యానించారు. రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్‌‌తో భేటీ సందర్భంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఈ కామెంట్స్ చేశారు. రష్యాతో రక్షణ, సైనిక విభాగాలు సహా అన్నిరంగాల్లో సంబంధాలను విస్తరించుకుంటామని ఆయన తెలిపారు.

ఇరుదేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఇక రష్యా రక్షణ మంత్రితో కూడిన ప్రతినిధి బృందానికి ఉత్తర కొరియా రక్షణ శాఖ ఏర్పాటుచేసిన విందులో కిమ్‌ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఉత్తరకొరియా రక్షణమంత్రి క్వాంగ్‌ చోల్‌తోనూ రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్‌‌ భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొనేందుకు ఇప్పటికేే దాదాపు 10వేల మందికిపైగా ఉత్తర కొరియా సైనికులు రష్యాకు చేరుకున్నారని ఉక్రెయిన్‌ వర్గాలు అంటున్నాయి. తమకు సైనిక సాయం చేస్తున్నందుకు ప్రతిఫలంగా ఉత్తర కొరియాకు యాంటీ మిస్సైల్స్‌ వ్యవస్థలను రష్యా అందించిందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed