Cyclone Update: చెన్నైపై కన్నెర్ర చేసిన ఫెంగల్.. విద్యాసంస్థలకు సెలవు.. ప్రభుత్వం అలర్ట్

by Rani Yarlagadda |
Cyclone Update: చెన్నైపై కన్నెర్ర చేసిన ఫెంగల్.. విద్యాసంస్థలకు సెలవు.. ప్రభుత్వం అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫెంగల్ తుపాను (Fengal Cyclone) తమిళనాడు (Tamilnadu)పై కన్నెర్ర జేసింది. శనివారం సాయంత్రానికి తమిళనాడు - పుదుచ్చేరిల సమీపంలో కరైకాల్ - మహాబలిపురం మధ్య తుపాను తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ తుపాను(Cyclone) నార్త్ తమిళనాడు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో చెన్నైకు రెడ్ అలర్ట్ (Red Alert for Chennai) జారీ చేసింది. తుపాను తీరాన్ని సమీపించే కొద్దీ.. చెన్నైలో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వెల్లూరు, రాణిపేటలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అలర్టయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. ముందు జాగ్రత్తగా పునారావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. చెన్నైలోని సబ్ వే లు, 850 కార్పొరేషన్ పార్క్ లను మూసివేశారు. చెన్నై - పుదుచ్చేరి వెళ్లే ఈసీఆర్ మార్గాన్ని సైతం అధికారులు క్లోజ్ చేశారు. అలాగే చెన్నైకు వచ్చే విమానాలను దారి మళ్లించారు. ప్రైవేటు సంస్థలు సైతం ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి.

ఐఎండీ (IMD) అంచనా ప్రకారం.. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఫెంగల్ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా గంటకు 7 కి.మీ వేగంతో కదులుతోంది. నవంబర్ 29 రాత్రి 11:30 గంటలకు నాగపట్నంకు తూర్పు-ఈశాన్యంగా 230 కి.మీ, పుదుచ్చేరికి తూర్పున 210 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 210 కి.మీ దూరంలో ఉంది. తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను తీరందాటే సమయంలో ఈదురు గాలుల వేగం 90 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేసింది వాతావరణశాఖ.

Advertisement

Next Story

Most Viewed