ఓ మహిళా చేస్తున్న అక్రమాలపై ఆందోళన చేసిన ఆర్పీలు..

by Aamani |   ( Updated:2024-11-30 04:04:53.0  )
ఓ మహిళా చేస్తున్న అక్రమాలపై ఆందోళన చేసిన ఆర్పీలు..
X

దిశ,కోదాడ : ఓ మహిళా చేస్తున్న అక్రమాలపై ఆర్పీలు పట్టణంలోని మెప్మా కార్యాలయంలో శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమె చేసిన అక్రమాలను చెబుతూ మాట్లాడారు. ఫేక్ సమభావన సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంకులతో కుమ్మక్కయి అనేక లక్షల రూపాయలను కొల్లగొట్టింది అని ఆరోపణ చేశారు. అంతేకాకుండా కమిషనర్ రామాంజనేయులు అనేకమంది కమిషనర్ల సంతకాలను ఫోర్జరీ చేసి అనేక మందిని మోసం చేసింది అని తెలిపారు. పట్టణంలోని 21వ వార్డులో ఆశా వర్కర్ గా పనిచేయాలి కానీ బినామీలను పెట్టి ఉద్యోగం చేస్తూ ఆర్పీ గా రావాలి అని రాజకీయ నాయకుల అండదండల తోటి మెప్మాలో పనిచేస్తున్న అధికారులను ఆర్పీగా పెట్టకపోతే కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తుంది. సంఘాలపై పెత్తనం చేస్తున్న ఆ మహిళ ఆగడాలను అరికట్టాలని అధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు ప్రమీల, పర్వీన్, సత్య కుమారి, నాగమణి, నాగలక్ష్మి, అనిత, లలిత, స్వాతి, చంద్రిక, ఆర్ అనిషా, సైదమ్మ, అఖిల, సాయమ్మ, శిరీష, గుంజ రాణి, మహేశ్వరి, ధనలక్ష్మి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

ఫేక్ ఎంసీపీలతో నిందలు మెప్మా ఉద్యోగులపై మోపడం సమంజసం కాదు..

యూనియన్ బ్యాంక్ సింబల్ తో ఫేక్ ఎంసీపీ చేయించి కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి ఆ నిందలు మెప్మా ఉద్యోగులపై మోపడం సమంజసం కాదని వివరణ ఇచ్చింది.ఆన్లైన్ ఎంసీపీ ... కక్షపూరితంగా మెప్మా ఉద్యోగులను ఇరికించడం తప్పా... ఈ ఎంసీపీ కి మెప్మా సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని మెప్మా సిబ్బంది తెలిపారు. ఆమెపై అనేక ఆరోపణలు రాగా నేను ఆశా వర్కర్ ను అంటూ పత్రికలకు స్టేట్మెంట్లు ఇస్తూ తప్పించుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed