Nagarjuna University: సాంబార్‌లో కప్ప.. మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

by Ramesh Goud |
Nagarjuna University: సాంబార్‌లో కప్ప.. మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur)లోని నాగార్జున వర్సిటీ(Nagarjuna University) హాస్టల్ విద్యార్థినుల ఆందోళనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Education Minister Nara Lokesh) స్పందించారు. వసతి గృహ వార్డెన్(Hostel Warden) ను సస్పెండ్(Suspended) చేయడంతో పాటు ఘటనపై విచారణకు ఆదేశించారు. గుంటురు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్ధులు గత రాత్రి భోజనం మానేసి ధర్నాకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో విద్యార్థులు భోజనం చేస్తుండగా.. సాంబార్ లో కప్ప కనిపించిందని భోజనం వదిలేసి వెళ్లారు.

దీనిపై వర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవడం పక్కన పెట్టి విషయాన్ని బయటకి రాకుండా చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ.. వర్సిటీ విద్యార్ధులు రాత్రి భోజనం మానేసి(Skipping Dinner) ఆందోళన(Protest)కు దిగారు. ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో యూనివర్సిటీ విద్యార్ధులపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై వెంటనే విద్యార్థినుల వసతిగృహ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని చెప్పారు. అంతేగాక మెస్ కాంట్రాక్టర్‌గా ఉన్న వార్డెన్‌పై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed