Bus Accident : ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్

by M.Rajitha |
Bus Accident : ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్
X

దిశ, వెబ్ డెస్క్ : సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్(Cell Phone Driving) చేయడం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. పదుల సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకున్న బస్ నడుపుతున్న ఓ డ్రైవర్ కూడా ఫోన్ మాట్లాడుతూ ఘోర ప్రమాదానికి(Bus Accident) కారణం అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ(Nalgonda) జిల్లాలోని దేవరకొండ(Devarakonda)లో ఈ ఘటన జరిగింది. బస్ నిండా జనంతో వెళ్తుండగా.. డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్ నడిపాడు. అలా మాట్లాడుతూనే ఉప్పుటేరు వాగు దగ్గర ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed