- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం : బొల్లం మల్లయ్య
దిశ, కోదాడ: అక్టోబర్ 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ రవీందర్రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని ఎఆర్‌ఎఆర్ ఫంక్షన్ హాలో జరిగిన కోదాడ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. గత తొమ్మిది సంవత్సరాల్లో కోదాడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరాటంకంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ కు మరోసారి పట్టం కడుతాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులంతా సమిష్టి కృషి చేయాలని కోరారు. కనీసం 50వేల మెజారిటీ తగ్గకుండా విజయం నమోదు చేస్తామని, ప్రచార యాత్రలో ఏ ఊరికి వెళ్ళినా ప్రజలు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. గులాబీ జెండా రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష అని, తెలంగాణ రాష్ట్ర ప్రగతి రథ చక్రాలు ఆగిపోకుడదంటే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లైతే మళ్లీ చీకటి రోజులు అలుముకొని రాష్ట్రం అంధకారంలో కూరుకుపోతుందన్నారు. నాయకత్వ లోపంతో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని ఆరోపించారు. ఆసరా పెన్షన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ, దళిత బంధు వంటి పథకాలు ఇతర రాష్ట్రాల నేతలను సైతం ప్రభావితం చేశాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని, నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కరిస్తున్న నాకు మీ సంపూర్ణ మద్దతు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవితా రాధారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సురేష్ నాయుడు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, అన్ని స్థాయిల చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.