- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ క్యాడర్ నారాజ్..
దిశ, సూర్యాపేట : సీఎం కేసీఆర్ కు అత్యంత ముఖ్య అనుచరుడిగా ఉన్న మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన నియోజక వర్గానికి వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి పెడుతున్నప్పటికీ తన పార్టీ సెకండ్ క్యాడర్ నాయకులు ఆయనకు దగ్గర కాలేక పోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదని నాయకులే కొన్ని చోట్ల తేటతెల్లం చేస్తున్నారు. ప్రజలతో తత్సంబంధాలు కలిగిన మేము పార్టీ పెద్దలు అనుసరిస్తున్న వైఖరితో వారికి ఏమి చేయలేక పోతున్నామని, వారి వద్ద తాము ఆదరణ కోల్పోతున్నామనే ధోరణిలో వారు ఉన్నట్లుగా కన్పిస్తోంది. దీనికి తోడు అభివృద్ధి పనుల్లో తమను భాగస్వాములను చేయడం లేదనే ఆవేదనలో ఉన్న వారు బహిరంగ ప్రదేశాల్లోనే చర్చించుకున్నట్లు సమాచారం.
దీనికి తోడు నిత్యం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులను కాదని పార్టీకి ఏనాడు సేవ చేయని వారికి పదవులు కట్టబెట్టారనే ధోరణిలో కొందరు నేతలు పార్టీకి దూరం వెళుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ మంత్రి తన అభివృద్ధి మంత్రాన్ని ప్రజలకు చేరవేయడంలో తన ద్వితీయ శ్రేణి నాయకత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. మంత్రి అనుకున్నట్లుగా ఆ నేతలు వారి స్థాయికి తగ్గట్టుగా పని చేయలేక పోతున్నారనేది బహిరంగ ప్రదేశాల్లో చర్చ సాగుతోంది. వీరి వ్యవహార శైలి మంత్రికి మున్ముందు తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. సుదీర్ఘ ఆలోచనలతో ముందుకు సాగే మంత్రి ఆ నేతల వ్యవహార శైలిని పసిగట్టలేక పోయారనేది బయట వినిపిస్తోంది.
సెకండ్ క్యాడర్ ఇవ్వడం లేదనే..
ప్రజలకు అన్ని తానై ఉండాలనే తలంపుతో ఉన్న మంత్రికి తన సొంత పార్టీ నేతలు తమ సెకండ్ క్యాడర్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారనే చర్చ జనంలో సాగుతోంది. మంత్రి సెకండ్ క్యాడర్ నాయకత్వాన్ని నమ్మడం లేదని,అందుకే తన తర్వాతి స్థానాన్ని ఎవ్వరికీ ఇవ్వడం లేదనేదనేది ఆ పార్టీ నాయకులు రహస్యంగా చర్చించుకుంటున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇతర పార్టీల్లో అంతటి స్థానాన్ని పొంది బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారికి ఈ క్యాడర్ విషయం అస్సలు మింగుడు పడటం లేదట.ఇదిలా ఉంటే ఆది నుంచి పార్టీ కోసం పని చేసిన తమను మంత్రి ఇంకా అదే స్థానంలో ఉంచుతున్నాడనే మరొక వాదనలు వినిపిస్తున్నాయి. అందువల్లనే గత రెండు నెలల క్రితం ఓ వర్గం బయటకి వెళ్లి తమ సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించిన విషయం తెలిసిందే.
కాగా మరి కొందరు నేతలు పార్టీలో ఉంటూనే మంత్రికి ఎటువంటి సందేహం కలగకుండా ఉంటూనే తమ తమ సామాజిక వర్గ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీకి అంటి ముట్టనట్లు ఉంటున్న ప్రజాప్రతినిధులు అభివృద్ధిని చూపితే జనం ఆ నాయకునికి ఎందుకు ఓట్లు వేయరని పలు సందర్భాల్లో చెప్పుకొంటున్న మంత్రికి తన కిందిస్థాయి నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు సమయం చూసి షాక్ ఇస్తారని వాదన వినిపిస్తోంది.ఇదిలా ఉండగా గత మున్సిపల్ ఎన్నికల్లో సుమారు అర కోటి రూపాయలు వెచ్చించి నేడు ఆర్థిక భారాన్ని మోస్తున్న ప్రజాప్రతినిధులు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా తమకు పార్టీలో అంతగా ప్రాధాన్యత దక్కట్లేదనే వాదన పలుచోట్ల తమ అత్యంత సన్నిహితులతో చెప్పుకొంటున్నట్లు సమాచారం.
తమల్ని నమ్మి గెలిపించిన ప్రజలకు తాము ఏమి పని చేయలేక పోతున్నామని, దీనివల్ల ప్రజల్లో తామూ ఆదరణ కోల్పోతున్నామనే తీవ్ర అసంతృప్తితో ప్రజాప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది.అభివృద్ధిలో భాగస్వాములమైన మేము ఆ పనుల్లో తమ పాత్ర లేకుండా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఒక ప్రధాన కాంట్రాక్టర్ సుమారు 70 మంది సబ్ కాంట్రాక్టర్ లతో పనులు చేయించుకుంటే తాము ఏమి చేయాలని పలు సందర్భాల్లో సంస్థాగతంగా చర్చలు జరిగినట్లు తెలిసింది.ఇదే తీరు గ్రామ పంచాయితుల్లోనూ కొనసాగుతున్నట్లు సమాచారం.ఇందువల్ల కలత చెందిన కొందరు ప్రజాప్రతినిధులు పార్టీకి కాస్త డిస్తేన్స్ మెయింటెన్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పదవులు దక్కలేదన్న ధోరణిలో అసంతృప్తుతులు...
అధికార పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం కలిగిన కొంతమంది నేతలు తమ ప్రతిష్టను పెంచుకునేందుకు అవి పదవులను పొందాలనుకోవడం పరిపాటి.అట్టి ఆశావాహులకు నేటి వరకు సైలెంట్ గానే ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది.మున్సిపల్ చైర్మన్ పదవి దగ్గరి నుండి జిల్లా,పట్టణ,గ్రామ శాఖ అధ్యక్షుల పదవులతో పాటు నామినేటెడ్ పదవులకు ఆశపడి బంగపడ్డ నేతలు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.రాజకీయాల్లో మెలకువలు నేర్చిన నేతలు సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఆశపడగా ఓ అనామక మహిళకు మంత్రి సముచిత స్థానం కల్పించిన విషయం తెలిసిందే.
అది దక్కని నేతలు మంత్రితో సఖ్యతగా ఉండటం లేరనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ.జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టిన నేతకే రెండు పదవులా అని సొంత పార్టీ నేతలే నాడు పెదవి విరిచారు.పట్టణ అధ్యక్ష పదవి ఉత్సహ వంతులైన యువకులకు కట్టబెడతారని ప్రచారంలో ఉన్నప్పటికే ఏ పార్టీలోకి అంతగా తొంగి చూడని వ్యక్తికి అట్టి పదవిని కట్టబెట్టడం పట్ల ఆశావాహులు అసంతృప్తి సెగలతో పార్టీని వీడారు. అయినప్పటికీ ఆయా స్థాయిల్లో అధ్యక్షులుగా ఉన్న అనామకులు నాయకుల పార్టీల మార్పుపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక నామినేటెడ్ పదవుల్లోనూ అదే తంతుతో ఉన్న అసంతృప్తులు పార్టీని వీడలేక కొనసాగుతున్నారనే ప్రచారం సాగుతోంది.మరి మంత్రి వీరిని గుర్తించి ఎలా బుజ్జగిస్తారనే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్నారు.