- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > BREAKING: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం.. నల్లగొండ మాజీ ఎంపీ కన్నుమూత
BREAKING: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం.. నల్లగొండ మాజీ ఎంపీ కన్నుమూత
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి (85) ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. నల్గొండ జిల్లా పీఏ పల్లికి మండల పరిధిలోని అజ్మాపురానికి చెందిన దామోదర్‌రెడ్డి.. 1980లో నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అనంతరం 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి రఘురామరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. దామోదర్‌రెడ్డికి భార్య సులోచన, కొడుకు సుభాష్‌చంద్రా రెడ్డి, కుమార్తె ఝాన్సీలక్ష్మీ ఉన్నారు. ఈ మేరకు ఇవాళ జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు.
Advertisement
Next Story