బీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్ రెడ్డి

by Mahesh |   ( Updated:2023-11-04 17:45:28.0  )
బీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్ రెడ్డి
X

దిశ, నేరేడుచర్ల:బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆ పార్టీని వీడి మంత్రి కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో హైదరాబాదు లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కేటిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .

హుజూర్‌నగర్‌లో క్యాడర్ ఉన్న లీడర్ గట్టు

గతంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి హుజూర్‌నగర్ నియోజకవర్గం నుండి 2014 అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 29692 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో ఉత్తమ్ గెలవగా రెండో స్థానం టీఆర్ఎస్ శంకరమ్మ మూడో స్థానంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి నిలిచారు. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ గట్టి పోటీని ఇచ్చారు. ఆయన ఏ పార్టీలో ఉన్న హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆయనకు కేడర్ అంటూ ఏర్పాటు చేసుకున్నారు. స

హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు చింతలపాలెం మఠంపల్లి హుజూర్‌నగర్ మండలంలో ఆయనకు అనుచరుల బలం ఉంది. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీకి కొంత బలం పెరిగినట్లు తెలుస్తుంది. హుజూర్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు కోసం క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆయనతోపాటు ఇప్పటి వరకు బీజేపీ పార్టీ లో పని చేసిన అనుచరులు కూడా రాజీనామాలు చేశారు. గట్టు శ్రీకాంత్ రెడ్డి చేరడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జోష్ వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed