- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రామీణ ప్రజల జీవితాలకు బలగం చిత్రం అద్ధంలాంటి...
దిశ, వలిగొండ : మండలంలోని నాగారం గ్రామంలో శనివారం బలగం సినిమా ప్రదర్శన నిర్వహించారు. గ్రామానికి చెందిన మంచి కంటి జగన్ శోభ జన్మదినం సందర్భంగా కీర్తిశేషులు మంచి కంటి విశ్వనాథం, వజ్రమ్మ, కీర్తిశేషులు మంచి కంటి యాదగిరి స్వరాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం బలగం సినిమాను స్థానిక కోట మైసమ్మ గుడి సమీపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంచి కంటి జగన్ శోభ చేతుల మీదుగా ఇంటికొకచీరను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంచి కంటి జగన్ మాట్లాడుతూ పుట్టిన ఊరుని, కన్నతల్లి తండ్రులను, వారు కన్న కలలను ఎప్పటికీ మరువ వద్దనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. బలగం చిత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన మంచి చిత్రమని అన్నారు.
గ్రామాలలో నివసించే సాధారణ మనిషి జీవితానికి దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు. స్వార్థాలతో, ద్వేశాలతో, అసూయాలతో గొడవలు పడి దూరమవుతున్న బంధాలు, బంధుత్వాలకు బలగం సినిమా కనువిప్పు కలిగిస్తుందని చెప్పారు. గ్రామాలలో జరిగే సన్నివేశాలకు ఈ చిత్రంలోని పాత్రలు అద్దం పడతాయని అన్నారు. సినిమా చూస్తుంటే బంధాలు బంధుత్వాలు గుర్తుకు వచ్చి ప్రేమానురాగాలు పెంపుతాయని అన్నారు. ఎవరైనా జీవితంలో, వారి కుటుంబాల్లో ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటే సినిమాలు చూపించినట్లుగా అందరి కలిసికట్టుగా ఉంటేనే కలకాలం ప్రతి ఒక్కరు జీవితాలు సంతోషంగా ఉంటాయని అన్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తీగల కృష్ణయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల నాగార్జున్, ఎండీ సలీం, మైసోళ్ల సత్యం, బొడిగె చందు, బుంగ ప్రవీణ్, పలేర్ల మహేష్, గ్రామస్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.