- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు
దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : ఏప్రిల్ 3 నుండి 13 వరకు నిర్వహించే 10 వ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లాలో పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. శనివారం వెబెక్స్ ద్వారా పదవ తరగతి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా విద్యార్థులు పరీక్షలు రాసేవిధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు, విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన డ్యూయల్ డస్క్ లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. పిల్లలకు పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు. ఆర్డీవోలు డివిజన్ పరిధిలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించాలని, మండలాలలో తాహాసిల్దార్, ఎంపీడీవోలు పరీక్షా కేంద్రాలను పరిశీలించాలన్నారు.
పరీక్షా కేంద్రానికి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు వెళ్ళటానికి అనుమతి లేదని, అధికారులు ఆదిశగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 12,386 మంది పరీక్షలు రాస్తున్నారని, వారి కోసం 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాలలో వైద్య బృందాలు అవసరమైన మందులతో సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్ ఓ డా. కోటాచలంనకు కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలోని పరీక్ష కేంద్రాలను పంచాయతీ సిబ్బంది, మున్సిపల్ పరిధిలోని పరీక్ష కేంద్రాలను శానిటేషన్ సిబ్బంది ప్రతి కేంద్రాలని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. విద్యుత్ శాఖ ద్వారా పరీక్ష కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని అలాగే పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు రవాణా కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.