మహిళా సాధికారతే అంబేద్కర్ లక్ష్యం

by Disha Web Desk 22 |
మహిళా సాధికారతే అంబేద్కర్ లక్ష్యం
X

దిశ, సూర్యాపేట: మహిళా సాధికారతే ధ్యేయంగా తన మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి డా. బీఆర్ అంబేద్కర్ అని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకి రాంరెడ్డి, చీఫ్ లీగలైడ్ డెఫన్స్ కౌన్సిల్ వసంత సత్యనారాయణ పిల్లే, పూర్వ ప్రభుత్వ న్యాయవాది గాదె రమాదేవిలు అన్నారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సంఘమిత్ర ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది తళ్లమల్ల హసేన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన జ్ఞాన సదస్సుకు వారు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రసంగించారు. రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశ ప్రథమ న్యాయ శాఖ మంత్రిగా ఉండి మహిళల హక్కుల కోసం ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. అందుకోసమే ఆయన మహిళా సాధికారికత, రాజ్యాంగ హక్కులు కోసం అహర్నిశలు పని చేస్తూ, తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా హిందూ కోడ్ బిల్ తయారు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి ప్రత్యేక బిల్లు తేవాలని ప్రయత్నం చేస్తే నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నివారించిన్నట్లు పేర్కొన్నారు. అందుకు అంబేద్కర్ మనోవేదనతో తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. విద్యార్థులంతా కస్టపడి చదువాలని, చదువుతోనే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని సూచించారు. ఈ సదస్సులో ప్రిన్సిపాల్ సునీల, వైస్ ప్రిన్సిపాల్ ప్రవళిక , అధ్యాపకులు దీపిక, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.


Next Story