- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డులో ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్ లో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్వామివారి దర్శనానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు కారులో కొండపైకి వస్తుండగా అదే సమయంలో భక్తులను కొండపైన దించి కిందికి వస్తున్న ఆర్టీసీ బస్సు మధ్యలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు ముందుకు భాగం ధ్వంసమైంది. అయితే కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు మార్గంలో ప్రమాద సూచికల బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కొండపైకి రావడానికి ఒక రోడ్డు, కొండపై నుంచి కిందికి దిగేందుకు ఇంకొక రోడ్డు వినియోగించుకుంటే ప్రమాదాలు జరగకుండా ఉండే ఆస్కారం ఉందని భక్తులు భావిస్తున్నారు. ఇంకొక ఘాట్ రోడ్డును కూడ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను భక్తులు కోరుతున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు చోటు చేసుకోలేదు.