రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Naveena |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, మిర్యాలగూడ : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కిష్టాపురం గ్రామానికి చెందిన బిల్లా కృష్ణమూర్తి(70) గ్రామంలోని పాలకేంద్రం వద్దకు వెళ్లి పాలు పోసి తిరిగి నడుచుకుంటూ..అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో దామరచర్ల వైపు నుంచి మిర్యాలగూడ వైపు బుల్లెట్ మోటార్ సైకిల్ ను నడుపుతున్న మిర్యాలగూడకు చెందిన నోసుము నాగేష్ వెనుక వైపు నుండి బలంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 సాయంతో మిర్యాలగూడ కు తరలించి, మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య బిళ్ళ మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Next Story