ఫారెస్ట్ అధికారులు భూమిని లాక్కోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతన్న

by Anjali |   ( Updated:2024-06-13 08:50:43.0  )
ఫారెస్ట్ అధికారులు భూమిని లాక్కోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతన్న
X

దిశ, వెబ్‌డెస్క్: ఫారెస్ట్ అధికారులు భూమిని లాక్కోవడంతో ఓ రైతన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ - అడవిదేవులపల్లి మండలం మొల్కచర్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నల్గొండ - అడవిదేవులపల్లి మండలం మొల్కచర్లలో ఫారెస్ట్ పరిధిలోని బంగారికుంట తండాలో గత పది సంవత్సరాల నుంచి రైతులు భూమి సాగు చేసుకుంటున్నారు. ఇటీవల ఫారెస్ట్ అధికారులు వచ్చి రైతులు పంట పండిస్తున్న భూములకు బలవంతంగా లాక్కున్నారు. ఆ భూమిలో మొక్కలు నాటి ఫారెస్ట్ అధికారులు భూమిని ఆక్రమించుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన కుర్ర కసన అనే 58 ఏళ్ల రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed