- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరద ప్రభావ ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం
దిశ,కోదాడ : భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను కేంద్ర విపత్తు నిర్వహణ అంచనా నిపుణుల బృందం బుధవారం సందర్శించింది. వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను ఏ ప్రదీప్ కుమార్ నేతృత్వంలో సందర్శించారు. కోదాడ మండల పరిధిలోని తొగర్రయి గ్రామంలో వరదల వల్ల కొట్టుకుపోయిన రోడ్లను, కూలిపోయిన ఇండ్లను నిపుణుల బృందం పరిశీలించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సభ్యులకు వివరించారు. సెప్టెంబర్ లో వచ్చిన భారీ వరదలతో జరిగిన పంట నష్టం గురించి రోడ్లు ,ఇరిగేషన్ ట్యాంకులు, నీట మునిగిన గృహాల గురించి కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బృందానికి వివరించారు. వరదల వల్ల ప్రజలకు ఎక్కువ నష్టం వాటిల్లిందని, అలాగే రైతులకు అనుబంధ శాఖలైన ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, అగ్రికల్చర్ ,హార్టికల్చర్లలో నష్టం జరిగినట్టు బృందం అంచనా వేశారు. పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని,జరిగిన నష్టానికి ఎంత పరిహారం అవసరమో నివేదిస్తామని తెలిపారు. నిపుణుల బృందంలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ పవన్ స్వరూప్ ,సీనియర్ సైంటిస్ట్ శివ చిదంబరం ,చీఫ్ సైంటిస్ట్ అజయ్ చౌరస్య ,ఈఎన్సీ ఇరిగేషన్ కె విజయకుమార్ , పంచాయతీరాజ్ షేక్ ఇమామ్ ,అర్బన్ ఇన్ఫాస్ట్రక్చర్ ఎస్ఎం సుభాని ,అర్బన్ సెక్టార్ రచన , సభ్యులు శాఖల వారీగా కోదాడ లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆర్ అండ్ బి ఈ సీతారామయ్య, ఆర్టీవో సూర్యనారాయణ, ఇరిగేషన్ డి ఈ రామకిషోర్ ,ఆర్ అండ్ బి డి పవన్, అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.