పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేయాలన్నదే నా విజన్ - సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |
పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేయాలన్నదే నా విజన్ - సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: విదేశీ పర్యటన ముగించుకుని తెలంగాణకు తిరిగి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బుధవారం.. కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ సమావేశానికి ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, అధికారులు హజరయ్యారు. కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌ ప్రారంభం అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైదరాబాద్‌ అభివృద్ధిపై ఏ మాత్రం అభిప్రాయబేధాలు లేవని. ఎయిర్‌పోర్ట్‌కు దగ్గర్లో ఫోర్త్‌ సిటీని నిర్మించబోతున్నామని. విదేశీ పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులు, వ్యాపారవేత్తలతో సమావేశమయ్యానని.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఎంతో ఉత్సాహం చూపించారని.. రూ.31,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. రానున్న రోజుల్లో మరిన్ని ఒప్పందాలు కుదరనున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ప్రపంచంతో పోటీ పడుతున్నానని.. వచ్చే పది సంవత్సరాల్లో.. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేయాలన్నదే నా విజన్ అని సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story