త్వరలో హైదరాబాద్ ఫైల్స్.. మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-21 08:26:50.0  )
త్వరలో హైదరాబాద్ ఫైల్స్.. మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు సంచనల వాఖ్యలు చేశారు. హైదరాబాద్ నుండి ఇస్లామాబాద్ వరకు టెర్రర్ కారిడార్ ఎంఐఎం ఏర్పాటు చేస్తుందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్, ఆదిలాబాద్ లో లవ్ జిహాద్ కేసులులో పురోగతి లేదని, బోధన్ లో హిందులను అక్రమ అరెస్టులు చేశారన్నారు. తెలంగాణ భారత దేశంలో ఉందా ? పాకిస్థాన్ లో ఉందా ? టీఆర్ఎస్, ఎంఐఎం కలిసిపోయి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మొన్న నిర్మల్.. నిన్న భైంసా... నేడు బోధన్ వరకు ఉగ్రవాదుల కారిడార్ గా మారుస్తున్నారని ఆరోపించారు. మతోన్మాద,ఉగ్రవాద కార్యకలాపాలకు కారణం కేసీఆర్ అని, హిందూవుల ప్రాణ, ఆస్తుల నష్టానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుండి హిందులు వలసలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. 1970 తర్వాత ఎందుకు హిందుల సంఖ్య తగ్గిందో తెలియాలన్నారు. త్వరలో కాశ్మీర్ ఫైల్స్ సినిమా లాగా హైదరాబాద్ ఫైల్స్ కూడా వస్తుందని మురళీధర్ రావు తెలిపారు.

Advertisement

Next Story