- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థికి ఘోర అవమానం! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏర్పడ్డ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి ఘోర అవమానం జరిగింది. సొంత పార్టీ కార్యాలయంలోనే ఆమెకు అనూహ్య పరిణామం ఎదురైంది. గురువారం పార్టీ కార్యాలయానికి స్రవంతి తన అనుచరులతో కలిసి కార్యాలయానికి వచ్చింది. దీంతో ఆమెను, ఆమె అనుచరులను కార్యాలయ సెక్యూరిటీ సిబ్బంది గేటు దగ్గరే ఆపేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
స్రవంతి అనుచరులకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడమే కాకుండా ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అధికార బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 97,006 వేల ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 86,697 వేల ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.