- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మావోయిస్టుల కుట్ర భగ్నం! రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ డిప్యూటీ దళ కమాండర్!
దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టుల కుట్రను ములుగు జిల్లా పోలీసులు భగ్నం చేశారు. తెలంగాణ- ఛత్తీస్గడ్ సరిహద్దులో గల వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో మందుపాతరలు అమరుస్తుండగా.. మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసులు మీడియాకు తెలిపారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వారిలో డిప్యూటీ దళ కమాండర్, ఇద్దరు మహిళలు, ముగ్గురు మిలిషియా సభ్యులు ఉన్నారు.
పట్టుబడిన మావోయిస్టుల వద్ద నుంచి ఒక డీబీబీఎల్ తుపాకి, నాలుగు కిట్ బ్యాగులు, వాకి టాకీలతో పాటు భారీగా పేలుడు సామాగ్రిని ములుగు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన మావోయిస్టులు పలు కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
పట్టుబడిన వారి వివరాలు:
1) కారం భుద్రి @ రీతా D/o విజ్ఞాలు, వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ దళ డిప్యుటీ కమాండర్
2) సోడి కోసి @ మోతే D/o అడమాలు. పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు
3) సోడి విజయ్ @ ఇడుమ s/o జోగ, బెటాలియన్ సభ్యుడు
4) కుడం దస్రు s/o గంగ, మిలిషియా సభ్యుడు
5) సోడి ఉర్ర s/o గంగయ్య, మిలిషియా సభ్యుడు
6) మడకం భీమ s/o కోస, మిలిషియా సభ్యుడు