- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాంగ్రెస్ శ్రేణులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక పిలుపు
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మతపరంగా దేశాన్ని రెండు ముక్కలుగా చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. భారతదేశం లౌకిక దేశంగా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందని అన్నారు. అదానీ కంపెనీలకు మోడీ లాభం చేకూర్చారని ఆరోపించారు. ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి లబ్ధిచేకూరుతోందని విమర్శించారు. డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయడం రాజకీయాల్లో అతికష్టమైన పని అన్నారు. పెద్ద పెద్ద సభలు పెట్టడం కన్నా.. ఇంటింటికీ తిరగడం మంచిదని పార్టీ శ్రేణులకు సూచించారు.
Next Story