- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
17 నుండి KCR పతనం స్టార్ట్.. దేశంలో ఆ పని చేయని ఏకైక వ్యక్తి మన CM: ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈ నెల 17న తెలంగాణలో కాంగ్రెస్ నిర్వహించనున్న సోనియా గాంధీ సభతో కేసీఆర్ పతనం ప్రారంభమవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజా దర్బార్ నిర్వహించని వ్యక్తి కేసీఆర్ ఒక్కడే అని మండిపడ్డారు. కేసీఆర్ అధికారకాంక్షతో రాష్ట్ర ఖజానా దుర్వినియోగం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70-80 సీట్లు గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ గెలుపు.. యావత్ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల గెలుపు అని అన్నారు.
ఇదిలా ఉంటే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ తలపెట్టినా కార్యక్రమాల్లో ఆయన పెద్దగా పాల్గొనలేదు. దీనికి కారణం ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన కీలక కమిటీల్లో ఆయనకు చోటు దక్కకపోవడమే అని పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కీలకమైన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన స్క్రీనింగ్ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కలేదు. కోమటిరెడ్డిని కాదని ఉమ్మడి నల్లగొండ జిల్లాకే చెందిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చోటు కల్పించడం ఆయనను మరింత ఆగ్రహానికి గురి చేసిందని టాక్.
దీంతో పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారని.. అధిష్టానం తీరుపై ఆయన అలకబూనారని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్వయంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. అంతేకాకుండా ఆయన ఇటీవల తెలంగాణకు వచ్చిన సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యి.. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని కోమటిరెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతోనే మళ్లీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాలిటిక్స్‌లో యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది.