Drunk and Drive: నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

by Shiva |
Drunk and Drive: నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ (New Year) వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ (Hyderabad)లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ట్యాంక్‌బండ్ (Tank Bund) చుట్టూ రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు ఐటీ కారిడార్‌ (IT Corridor)లో ఫ్లైఓవర్లను కూడా మూసివేశారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) టెస్టులను నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills), మాదాపూర్ (Madhapur), గచ్చిబౌలి (Gachibowli), హైటెక్ సిటీ (Hi-Tech City)లో పలు పబ్బులు, బార్లపై పోలీసులు ప్రత్యేక నిఘాను పెట్టారు. ఈ క్రమంలోనే నిన్న ఒక్కరోజే నగర వ్యాప్తంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్‌లో అత్యధికంగా 236 కేసులు, సౌత్ ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179 కేసులు, నార్త్ జోన్‌లో 177, సౌత్ వెస్ట్ జోన్‌లో 179 కేసులు, అత్యల్పంగా సెంట్రల్ జోన్‌లో 102 కేసు నమోదు అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed