- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముగిసిన భేటీ.. CM రేవంత్‌తో కేకే చర్చించిన అంశం ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు సమావేశం ముగిసింది. కాంగ్రెస్‌లో చేరుతానని అధికారికంగా ప్రకటించిన కేకే శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా చేరికతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చేరిక ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేకేతో పాటు కాంగ్రెస్‌లో ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా చేరబోతున్నారు. కాగా, ఈనెల 22న కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ స్వయంగా కేశవరావు నివాసానికి వెళ్లారు. కేశవరావుతో పాటు ఆయన కూతురు, మేయర్ విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీపాదాస్ మున్షీ ఆహ్వానంతో.. తండ్రి, కూతురు ఇద్దరూ బీఆర్ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌కు సైతం కేశవరావు స్వయంగా వివరించారు.