MP Elections 2024 : నేడు పోలింగ్ తుది గణాంకాలు వెల్లడి

by Rajesh |
MP Elections 2024 : నేడు పోలింగ్ తుది గణాంకాలు వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 17 పార్లమెంట్ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక పోలింగ్ సోమవారం జరిగింది. ఇక ఈవీఎంలలో 525 మంది అభ్యర్థుల భవితవ్యం దాగిఉంది. భువనగిరిలో అత్యధికంగా 76.47 శాతం పోలింగ్ నమోదు కాగా.. హైదరాబాద్‌లో అత్యల్పంగా 46.08 శాతం పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 48.11 శాతం, మల్కాజిగిరిలో 50.12 శాతం, ఖమ్మం 75.19శాతం, జహీరాబాద్ నియోజకవర్గంలో 74.54 శాతం, చేవెళ్ల నియోజకవర్గంలో 55.45 శాతం పోలింగ్ నమోదైంది.

మెదక్ నియోజకవర్గంలో 74.38 శాతం, నల్గొండ నియోజకవర్గంలో 73.78 శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ 72.96 శాతం, కరీంనగర్ 72.33 శాతం, మహబూబ్‌నగర్‌లో 71.54 శాతం, నిజామాబాద్ నియోజకవర్గంలో 71.50 శాతం, మహబూబాబాద్ నియోజకవర్గంలో 70.68 శాతం, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో 68.96 శాతం, వరంగల్ నియోజకవర్గంలో 68.29 శాతం, పెద్దపల్లి నియోజకవర్గంలో 67.88 శాతం పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 50.34 శాతం పోలింగ్ నమోదైంది. అయితే నేడు పోలింగ్ శాతం తుది గణాంకాలను సీఈవో వికాస్ రాజ్ వెల్లడించనున్నారు. వచ్చే నెల 4న లోక్ సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.

Advertisement

Next Story