- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
MLAగా గెలిస్తే హోం మంత్రి అయ్యేవాడిని.. ఎంపీ బలరామ్ నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో : తాను ఎమ్మెల్యేగా గెలిస్తే, హోమ్ మంత్రిని అయ్యేవాడినని ఎంపీ బలరామ్ నాయక్ పేర్కొన్నారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్, ఏఐసీసీ ఆదేశాలతోనే వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. ఎంపీగా పోటీ చేస్తే, మరోసారి కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని హామీ ఇచ్చారన్నారు. గురువారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాల మేరకే ఎంపీగా పోటీ చేసి, గెలిచానన్నారు. కాంగ్రెస్ తక్కువ సీట్లతో సెంట్రల్లో పవర్లోకి రాలేకపోయిందన్నారు. రెండేళ్ల లోపు మోడీ సర్కార్ కూలిపోవచ్చన్నారు. కాంగ్రెస్కు సెంట్రల్లో పవర్ ఖాయమన్నారు. చామల కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నదన్నారు. ఇక పీసీసీ పదవి లంబాడాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తమకు పీసీసీ ఇవ్వలేదన్నారు. బీసీ, ఎస్సీలు కూడా అడుగుతున్నారని, ఈ సారి తమకు ఇస్తే బెటర్ అంటూ కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ముందుకు సాగుతుందని, ప్రజా పరిపాలన అద్భుతంగా జరుగుతుందన్నారు.