- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాచకుడిని ముంచిన ఘరానా మోసగాడు.. అప్పు తీసుకుని ఎగనామం
దిశ, వెబ్‌డెస్క్: డబ్బున్నోళ్లని దోచుకునేటోళ్లని చూశాం. నమ్మినోళ్లకి నమ్మకద్రోహం చేసి మోసం చేసేటోళ్లని చూశాం.. కానీ ఓ ఘరానా మోసగాడు (Fraud) ఏకంగా ఓ ముసలి యాచకుడిని నమ్మించి మోసం చేశాడు. ఈ ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలోని బోనకల్ మండలంలో చోటు చేసుకుంది. కేవలం ఆయన ఒక్కడినే కాదు..ఆ ముసలి యాచకునితో పాటు ఏకంగా 69 మందిని మోసం చేసి లక్షల రూపాలయకు ఐపీ పెట్టాడు సదరు మోసగాడు.
మండలంలోని సాయిబాబా గుడి వద్ద ఎన్నో ఏళ్ల నుంచి భార్యతో కలిసి అశోక్ (AShok) అనే యాచకుడు యాచక వృత్తిలో ఉన్నాడు. అలా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని బిడ్డ భవిష్యత్ కోసం దాచుకున్నాడు. అయితే 3 సంవత్సరాల క్రితం స్థానికంగా హోటల్ వ్యాపారం చేస్తున్న నర్సింహారావు అనే వ్యక్తి తనకు కొంత డబ్బు అప్పుగా కావాలని, దానికి వడ్డీ చెల్లిస్తానని నమ్మబలిగి అశోక్ దగ్గరి నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. అప్పటి నుంచి వడ్డీ చెల్లించకపోగా.. ఇటీవలికాలంలో అశోక్‌కు కనపడకుండా తిరగడం స్టార్ట్ చేశాడు. దీంతో అశోక్ ఓ రోజు నిలదీయడంతో ఏకంగా ఐపీ నోటీసులు (IP Notices) పంపించాడు.
ఈ నోటీసులు కేవలం అశోక్‌కు మాత్రమే కాకుండా.. మొత్తం 69 మందికి పంపించాడు. ఖమ్మంలోని సివిల్ కోర్టులో దివాళా పిటిషన్ దాఖలు చేసిన నర్సింహారావు.. నోటీసులిచ్చిన 69 మంది నుంచి నర్సింహారావు ఏకంగా ఒక కోటీ 95లక్షల అప్పు తీసుకున్నాడు.
ఇక ఐపీ నోటీసులు అందుకున్న అశోక్.. ఎన్నో ఏళ్లుగా బిచ్చం ఎత్తుకుని దాచుకున్న డబ్బు ఒక్క సారిగా పోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నాడు. వ్యాపారి నర్సింహారావును నమ్మి ఇస్తే నట్టేట ముంచాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన బిడ్డ చదువు (Education) కోసం దాచుకున్న డబ్బును వ్యాపారికి అప్పుగా ఇచ్చానని.. తనకు న్యాయం చేయాలంటూ ప్రాథేయపడుతున్నాడు.