- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో రూ.500 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్
దిశ, తెలంగాణబ్యూరో: మూడు రోజులపాటు హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన 20వ ఎడిషన్ బయో ఏషియా-2023 సదస్సు ఆదివారం ముగిసింది. ‘అడ్వాన్సింగ్ ఫర్ ఒన్ : షేపింగ్ నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్’ నేపథ్యంతో నిర్వహించిన ఈ సదస్సులో 50 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 200లకు పైగా బీ2బీ సమావేశాలు జరిగాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు కోర్నింగ్, ఎస్‌జీడీ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. రూ.500 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధం వ్యక్తం చేశాయి. ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ సామగ్రి ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన తర్వాత సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఎస్‌జీడీ ఫార్మా ఎండీ అక్షయ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రైమరీ ప్యాకేజింగ్ సరఫరా గొలుసును సురక్షితం చేయడం ద్వారా తెలంగాణలో ఫార్మా పరిశ్రమను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో భాగ్యసామ్యం కలిగి ఉన్నందుకు తాము గర్విస్తున్నామన్నారు. సుమారు రూ.500 కోట్లతో ఉద్దేశించిన ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 150 శాశ్వత ఉద్యోగాలు, 300 కన్నా ఎక్కువ మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నదని పేర్కొన్నారు. కోర్నింగ్ సంస్థ ఎండీ సుధీర్ పిళ్లై మాట్లాడుతూ.. 2024 వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫార్మా స్యూటికల్ ప్యాకేజింగ్ నాణ్యతను మెరుగుపరుస్తూనే క్లిష్టమైన ఔషధాల పంపిణీని వేగవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఫాక్స్ లైఫ్ సైన్సెస్ రూ.200 కోట్లు..
ఫార్మాస్యూటికల్ సింగిల్ యూజ్ టెక్నాలజీలో సామర్థ్యాలను విస్తరించేందుకు తెలంగాణలో రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికాకు చెందిన ఫాక్స్ లైఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఫాక్స్ లైఫ్ సైన్సెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏక్నాథ్ కులకర్ణి మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో కస్టమ్ మెడికల్, ఎస్‌యూటీ ఫార్మాలో వినియోగదారులకు మద్దతు ఇచ్చేందుకు ప్రపంచ స్థాయి ఫెసిలిటీని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.