- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్.. ఫోన్ ట్యాప్ కేసులో వెలుగులోకి మరిన్నీ సంచలన విషయాలు..!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక అంశం వెలుగు చూసింది. ఎస్ఐబీకి టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న వ్యక్తి ద్వారానే ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ డివైజ్‌లను విదేశాల నుంచి తెప్పించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు వ్యక్తిని కూడా విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించినట్టుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన ప్రణీత్ రావును కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న తరువాత జరిపిన విచారణలో ట్యాపింగ్ డివైజ్‌లను విదేశాల నుంచి తెప్పించినట్టుగా వెల్లడైన విషయం తెలిసిందే. కాగా, విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం ఇజ్రాయిల్ నుంచి ఈ ట్యాపింగ్ డివైజ్‌లను తెప్పించినట్టుగా సమాచారం. 300 మీటర్ల పరిధిలో ఫోన్లను ట్యాప్ చేసి మాటలు నేరుగా వినపడటానికి ఉపయోగపడే ఈ డివైజ్‌ను ఎస్ఐబీకి టెన్నికల్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేర తెప్పించినట్టుగా తెలుస్తోంది.
దీని కోసం భారీ మొత్తంలో నగదును ఖర్చు చేసినట్టు సమాచారం. ఇలా తెప్పించిన డివైజ్‌ను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి సమీపంలో ఏర్పాటు చేసుకున్న ఆఫీస్‌లో పెట్టినట్టు తెలిసింది. ఆ తరువాత సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మిత్రుల ఫోన్లను ట్యాప్‌చేసి ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పై అధికారులతో పాటు బీఆర్ఎస్‌లోని కొందరు కీలక నేతలకు చేరవేసినట్టుగా సమాచారం. విచారణలో ప్రణీత్‌రావు ఈ విషయాన్ని వెల్లడించినట్టుగా తెలియవచ్చింది. ఈ క్రమంలో సదరు టెక్నికల్ కన్సల్టెంట్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ బృందం నిర్ణయించినట్టుగా తెలిసింది.