- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
- Union Budget 2025-2026
ఖాతాల్లో డబ్బు జమ.. మెసేజ్ లు చూపిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఇచ్చిన మాట ప్రకారం రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేసిందని రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ ఖాతాలలో డబ్బులు జమ అయినట్లు బ్యాంకు నుంచి వచ్చిన మేసేజ్ (messages) లను చూపించి మురిసిపోతున్నారు. అంతేగాక బ్యాంకు (Bank) నుంచి వచ్చిన మేసేజ్ లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను (Screenshots) గ్రామాలలోని సోషల్ మీడియా (Social Media) ఖాతాలలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నదని రైతులు చెబుతున్నారు.
కష్ట కాలంలో కూడా రైతుల బాధలు అర్థం చేసుకొని పెట్టుబడి సాయం అందించారని చెబుతూ.. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ధన్యవాదాలు (Thanking) తెలుపుతున్నారు. అలాగే మిగతా హామీలను (Promises) కూడా అమలు చేస్తుందన్న నమ్మకం తమకు ఉన్నదని కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వీటితో పాటు మరో రెండు పథకాలకు సంబంధించి మండలానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన గ్రామాల్లో తొలిరోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. అంతేగాక పాత రేషన్ కార్డులలో 1.03 లక్షల మంది పేర్లు చేర్చినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Minister Thummala Nageswar Rao) స్పష్టం చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాక ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది.
ఇందులో భాగంగా జనవరి 26న నాలుగు పథకాలను అమలు చేసింది. గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రైతుల ఖాతాలలో సోమవారం నుంచి రైతు భరోసా (Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma Atmiya Bharosa)కు సంబంధించిన డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు. అలాగే మరో రెండు పథకాలైన రేషన్ కార్డులు (Ration Cards), ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)ను కూడా రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వీటిపై పేరలైన అర్హులందరికీ ఈ పథకాలు తప్పక అందుతాయని, వీటిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ప్రతిపక్షాలు (Opposition Parties) ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని, వారి మాటలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు.