- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BRS: ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను వేధించే పాలన.. మాజీమంత్రి కేటీఆర్

దిశ, వెబ్ డెస్క్: ఇది ప్రజాపాలన (People's Government) కాదు.. ప్రజలను వేధించే పాలన అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) విమర్శించారు. తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల (Suicides) గురించి ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government)పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR).. ఆకలిచావులు, ఆత్మహత్యల తెలంగాణను పదేళ్ల పాలనతో కేసీఆర్ (KCR) దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారని తెలిపారు. ఏడాది కాంగ్రెస్ పాలన (Congress Governance)లో అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణను చేశారని దుయ్యబట్టారు.
అలాగే హైడ్రా (Hydra), మూసీ ప్రక్షాళన (Musi cleansing) పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్ (Telangana Real Estate) ను కుదేలు చేశారని విమర్శలు (criticized) చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులు రాక, మిత్తి కూడా ఎల్లక ఉసురు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి కేసీఆర్ రైతులలో ఆత్మవిశ్వాసం నింపి, వ్యవసాయ రంగానికి (Agricultural Sector) వెన్నెముకగా నిలిచారని, కానీ ఏడాది రేవంత్ పాలనలో సాగునీళ్లు లేక (irrigation water), కరెంటు రాక (no electricity), పంటలు కొనుగోలు చేయక (no crops), రైతుభరోసా లేక, రుణమాఫీ (loan waivers) గాక అన్నదాతలు ఆత్మహత్యలు (farmers) చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను వేధించే పాలన అంటూ.. జాగో తెలంగాణ జాగో (Jago Telangana Jago) అని బీఆర్ఎస్ నేత (BRS leader) పిలుపునిచ్చారు. కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిత్యం మీడియా సమావేశాలు నిర్వహించడమే గాక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలపై విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడుతుంటారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆత్మహత్యలకు సంబంధించి ఓ దిన పత్రికలో వచ్చిన కథనాలకు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.