Vijayanagaram:‘సంక్షేమ పథకాలు అటకెక్కాయి’.. జిల్లా వైసీపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
Vijayanagaram:‘సంక్షేమ పథకాలు అటకెక్కాయి’.. జిల్లా వైసీపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, విజయనగరం: పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమయ్యారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీన జరిగే ఫీజు- పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలన్నారు. వైఎస్ జగన్ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు మేలు జరిగిందన్నారు. ఉన్నత విద్యకు వైఎస్ జగన్ 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాలు అట్టకెక్కాయన్నారు. 3900 కోట్ల బకాయిలు ఉన్న ప్రభుత్వం మొద్దు నిద్రని అన్నారు.పేద విద్యార్థుల ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయం వద్దనున్న డా.వైయస్సార్ గారి విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుతామన్నారు. అనంతరం మున్సిపల్ కంటోన్మెంట్ కార్యాలయం వద్ద నుండి విద్యార్థుల పోరుబాట నిరసన ర్యాలీ చేపట్టి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తామన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని కార్యక్రమానికి హాజరవ్వాలన్నారు.

Next Story

Most Viewed