Polavaram Project : పోలవరం ప్రాజెక్టుని పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం

by Y. Venkata Narasimha Reddy |
Polavaram Project : పోలవరం ప్రాజెక్టుని పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం
X

దిశ, వెబ్ డెస్క్ : పోలవరం ప్రాజెక్టు(Polavaram Projec) డయాఫ్రం వాల్ సహా ఇతర నిర్మాణ పనులను విదేశీ, కేంద్ర జలసంఘం నిపుణులు(Foreign and Central Water Resources Committee Experts), పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు(Polavaram Project Authority Officials) పరిశీలించారు. అమెరికాకు చెందిన అంతర్జాతీయ నిపుణులు డియాన్ ఫ్రాన్క్కో డి సిస్కో, డేవిడ్ పాల్ సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్ నిర్మాణ పనులు పరిశీలించి..ఆ ప్రాంతంలో అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ని పరిశీలించారు.

నేడు, రేపు ప్రాజెక్టు పనులపై చర్చించాల్సిన ఎజెండా అంశాలను సమీక్షించుకున్నారు. డయాఫ్రంవాల్ పనులను.. బ్యాచింగ్ ప్లాంటు, ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్స్, యంత్ర సామగ్రి, మెటీరియల్ సంసిద్ధత తదితర అన్ని అంశాలనూ పర్యవేక్షించారు. వ్యాప్కోస్, సీఎస్ఎంఆర్ఎస్ ప్రతినిధులు పోలవరంలోనే ఉండి పనుల నాణ్యతను పరిశీలించనున్నారు. ఎప్పటికప్పుడు నాణ్యతను నిర్ధారించే పరీక్షలు చేసేందుకు పోలవరంలోనే ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాట్లు పటిష్టం చేయనున్నారు.

గుత్తేదారులు చేపట్టే పరీక్షల పైనే ఆధారపడకుండా విడిగా నాణ్యత, నియంత్రణ పరీక్షలు చేపట్టాలని జల వనరులశాఖ నిర్ణయించింది. విదేశీ నిపుణుల బృందంలో మరో ఇద్దరు వారి దేశం నుంచే ఆన్ లైన్ ద్వారా చర్చల్లో పాల్గొంటారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీప్ ఇంజినీరుగా కొత్తగా నియామితులైన కేంద్ర జలసంఘం ఎస్ఈ ఎం. రమేశ్ కుమార్ సైతం విదేశీ నిపుణులతో పాటు ప్రాజెక్టును సందర్శించారు.

కేంద్ర ప్రభుత్వం రూ.960 కోట్లు కేటాయించిన నేపథ్యంలో.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం జరుగనుంది. ప్రాజెక్టును విదేశీ నిపుణులు డేవిడ్ పాల్, డి సిస్కో, పోలవరం అథారిటీ మెంబర్ కార్యదర్శి ఎం. రఘురామ్, మన్ను జి.ఉపాధ్యాయ, డి. రూపేష్, కేంద్ర జలసంఘం డిజైన్ల చీఫ్ ఇంజినీర్ సరబీ జీత్ సింగ్ బక్ష్మీ, డైరెక్టర్ రాకేష్, డిప్యూటీ డైరెక్టర్ అశ్వనీకుమార్ వర్మ, సీఎస్ఎంఆర్ఎస్ నుంచి హోంకన్ వార్, రవి అగర్వాల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Next Story