- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ కుటుంబంపై మోడీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతి రాజ్యమేలుతోందని మోడీ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. పరేడ్ గ్రౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. తెలంగాణలో రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. మహబూబ్ నగర్ - చించోలి రహదారి పనులు చేపట్టామన్నారు.కల్వకుర్తి - కొల్లాపూర్ రహదారి పనులు చేపట్టామన్నారు. రోడ్ల కనెక్టివిటీలో భాగంగా నాలుగు హైవే ప్రాజెక్ట్స్ కు శ్రీకారం చుట్టామన్నారు. ఒకప్పుడు 2500 కిలో మీటర్లు నేషనల్ హైవేలు ఉంటే ఇప్పుడు 5000 కి.మీ దాటాయన్నారు.
రూ.35,000 కోట్లు తెలంగాణలో రోడ్ల అభివృద్ధిపై ఖర్చుచేశామన్నారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ కూడా అమల్లో ఉందన్నారు. పరిశ్రమలు, వ్యవసాయ అభివృద్ధికి కేంద్రం చేయూత అందిస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా 7 మెగా టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో ఒకటి తెలంగాణలో ఏర్పాటు కానుందన్నారు. టెక్స్ టైల్ పార్కు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. విద్యపై పెట్టుబడులు పెంచుతున్నామన్నారు. రాష్ట్రం కేంద్రంతో కలిసి రావడం లేదన్నారు. పనిచేస్తున్న వాళ్లతో కొంత మంది ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఇలాంటి వారి నుంచి అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణలో కుటుంబపాలనతో అవినీతి పెరిగిందన్నారు. కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోందన్నారు. నిజాయితీగా పనిచేస్తున్న వాళ్లు వాళ్లకు గిట్టడం లేదని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యనించారు. సొంత కుటుంబం ఎదిగితే చాలనుకుంటారని మోడీ మండి పడ్డారు. అన్ని విషయాల్లో తమ కుటుంబ స్వార్థం చూసుకుంటారన్నారు. కుటుంబ వాదంతో అవినీతి పెంచి పోషిస్తున్నారన్నారు. కుటుంబ వాదంతో ప్రతీ వ్యవస్థను తమ అదుపులో ఉంచుకోవాలనుకుంటారన్నారు. వారి నియంత్రణను ఎవరు సవాల్ చేయకూడదని కోరుకుంటారన్నారు. ఇలాంటి వాళ్ల పట్ల తాను కఠినంగా ఉంటానని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందా లేదా అన్నారు.
అవినీతి, కుటుంబ పాలన వేర్వేరుగా ఉండవన్నారు. ప్రజల ఆంకాక్షలు నెరవేర్చడమే తన లక్ష్యమన్నారు. మేం అభివృద్ధి కోసం పని చేస్తుంటే కొంత మంది స్వలాభం కోసం పనిచేస్తున్నారన్నారు. అవినీతిపై విచారణ చేసే సంస్థలను ప్రతిపక్ష నాయకులు బెదిరిస్తున్నారని మోడీ మండి పడ్డారు.
Read More: