- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భోజనం సరిగా లేదని వసతిగృహాన్ని వీడిన విద్యార్థులు..
దిశ, దిలావర్పూర్ : దిలావర్పూర్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో భోజనం సరిగా లేదని బాలికలు ఇంటికి వెళ్లారు. వసతి గృహంలో భోజనాలు సరిగా పెట్టడం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని, సమయానికి అన్నం పెట్టడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు వచ్చి వసతి గృహం వద్ద ఆందోళన చేస్తూ తమ తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. 350 మంది విద్యార్థులు ఉన్న వసతి గృహం నుండి దాదాపు 250 మంది విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు ఈ విషయం పై దృష్టి పెట్టకపోవడం వల్ల అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో తాము వచ్చామని, పిల్లలు వసతి గృహంలో అనారోగ్యం పాలైతే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంఈఓ కస్తూరి శంకర్ ఎంత సర్ది చెప్పినా వినకుండా తల్లిదండ్రులు విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లారు.
ఇదే విషయం పై కేజీబీవీ ప్రధాన అధ్యాపకురాలని వివరణ కోరగా గత 15 రోజుల నుండి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరు ఆందోళన చేస్తుండడంతో తాము విధులకు హాజరు కాలేకపోయామని, బోధన బోధనేతర సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారని అన్నారు. భోజనం సరిగా లేదని విద్యార్థులు ఇంటికి వెళ్లిన మాట వాస్తవమేనని, తాము వెంటనే పాఠశాలకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశామని తెలిపారు. అందరు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థులను పాఠశాలకు పంపాల్సిందిగా కోరామని, రేపటికల్లా పాఠశాలకు అందరు విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రధాన అధ్యాపకురాలు అపర్ణ కోరారు.