Constable: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్

by Maddikunta Saikiran |
Constable: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(AP) రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్(PC) పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28వ తేదీన నోటిఫికేషన్‌(Notification) విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించి ప్రిలిమ్స్(Prelims), మెయిన్స్(Mains) పరీక్షలను గతేడాది నిర్వహించి తుది ఫలితాలను(Final Results) కూడా ప్రకటించారు. మొత్తం 95,209 మందిని ఫిజికల్‌ టెస్టుల కోసం ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే.. క్వాలిఫై అయినా అభ్యర్థులకు పీఎంటీ(PMT), పీఈటీ(PET) ఈవెంట్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. కాగా ఈవెంట్లకు ఎంపికైన వారు హాల్ టికెట్లను(Hall Tickets) డౌన్ లోడ్ చేసుకోవడానికి గడువు ఈ రోజుతో ముగియనుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఆఫీసు సమయంలో(ఉ.10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) 9441450639, 9100203323 ఫోన్‌ నంబర్లకు కాల్(Call) చేయాలని లేదా అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in/ ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed