CPI: ప్రజల కోసం పోరాడేదే ఎర్రజెండా.. ఎమ్మెల్యే కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |
CPI: ప్రజల కోసం పోరాడేదే ఎర్రజెండా.. ఎమ్మెల్యే కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అనునిత్యం ప్రజల కోసం పోరాడేదే ఎర్రజెండా అని, హక్కుల కోసం సంఘాలను స్థాపించింది సీపీఐ పార్టీయే(CPI Party) అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA kunamneni Sambashiva Rao) అన్నారు. రేపు నల్లగొండ(Nalgonda)లో జరగనున్న ఉత్సవాలపై మగ్దుమ్ భవనంలో(Magdum Bhavan) నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. శతాబ్ధి ఉత్సవాల బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యమాలకు పురుడు పోసిన నల్లగొండ గడ్డ పై ఎంతో మంది కమ్యునిస్టు లీడర్లు ప్రాతినిధ్యం వహించారని, అంతటి మహోన్నతమైన విప్లవ పోరాట చరిత్ర కలిగిన నల్లగొండ జిల్లా కేంద్రంలో సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభ జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలు సంవత్సరకాలం పాటు జరుగు కార్యక్రమాలకు నాంది పలుకుతాయని అన్నారు.

అంతిమంగా కమ్యునిజానికి అంతం లేదని పుట్టగొడుల్ల పుట్టుకొచ్చే పార్టీలు అధికారం లేకపోతే కనుమరుగయ్యే పార్టీలు, రోజుకో జెండా మార్చే నాయకులు ఉన్న ఈ రోజుల్లో వందేళ్ళ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి ఒక్కరికీ ఓ దిక్సూచి అని తెలిపారు. అధికారం ఉన్నా లేకపోయినా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు ఒడిదుడుకులను ఎదుర్కొని కార్మికులకు ఎనిమిది గంటల పనిదినాలు, ఉపాధి హామీ చట్టం, దున్నే వాడిదే భూమి అంటూ ఎన్నో చట్టాల అమలులో కమ్యూనిస్టుల పాత్ర కీలకం అని పేర్కొన్నారు. కార్మిక హక్కుల సాధనకై కార్మికుల కోసం కర్షకుల కోసం పేదవాడి ఆకలి తీర్చడానికి పోరాటాలు నిర్వహించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, దేశ స్వతంత్రం కోసం తెలంగాణ విముక్తి పోరాటంలో విలీన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని అన్నారు. వారందరి ఆశయ సాధనలో భాగంగా ఈ శతాబ్ది వేడుకను అత్యంత వైభవంగా ఉత్సాహపూరితంగా జరుపుతూ.. రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని నింపుతూ.. కమ్యూనిస్టులకు పూర్వ వైభవంతో పాటు ఉద్యమ కార్యచరణకు ఈ వేదిక నాంది పలుకుతుందని కూనంనేని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed