ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామిని కలసిన మాజీ జడ్పీటీసీ...

by Sumithra |
ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామిని కలసిన మాజీ జడ్పీటీసీ...
X

దిశ, తలమడుగు : తలమడుగు మండల మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఆదివారం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ జడ్పీటీసీ తన స్వగృహానికి ఆహ్వానించగా వారి కోరిక మేరకు వివేక్ వెంకట స్వామి, మాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య వెళ్లారు. ఈ మేరకు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. తన కోరిక మేరకు విచ్చేసిన వారికి మాజీ జడ్పీటీసీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో మాజీ జడ్పీటీసీలు కొండా గంగాధర్, బాబన్న, శ్రీధర్, కృష్ణ రెడ్డీ, సాంబశివ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed