Social Media:‘చెడు విషయాలు పోస్ట్ చేయొద్దు.. నైతికంగా పతనం కావొద్దు’.. ప్రధాన నగరాల్లో వెలసిన ఫ్లెక్సీలు!

by Jakkula Mamatha |
Social Media:‘చెడు విషయాలు పోస్ట్ చేయొద్దు.. నైతికంగా పతనం కావొద్దు’.. ప్రధాన నగరాల్లో వెలసిన ఫ్లెక్సీలు!
X

దిశ,వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపై కూటమి ప్రభుత్వంలో వార్ మొదలైంది. ఇప్పటికే అసత్య ప్రచారాలు చేస్తున్న వారి ఆట కట్టించేందుకు చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తాజాగా హోర్టింగులతో ప్రచారం మొదలు పెట్టింది. సోషల్ మీడియా(Social Media) విషయంలో ప్రజలను, నెటిజన్లను చైతన్యపరిచే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు మరో అడుగు ముందుకు వేసింది. మార్ఫింగ్‌, బూతు పురాణంతో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టవద్దంటూ తాజాగా క్యాంపెయిన్ చేపట్టింది. సోషల్ మీడియాను మంచికి వాడుదామంటూ పలు నగరాల్లో భారీ హోర్డింగ్‌లు(hoardings), ఫ్లెక్సీలు(Flexi) ఏర్పాటు చేసింది.

విజయవాడ- గుంటూరు(Vijayawada - Guntur) దారిలో తాడేపల్లి హైవే(Tadepalli Highway) వద్ద అధికారులు భారీ హోర్డింగ్‌లు వెలిశాయి. రాజకీయ పార్టీలు చెప్పాయని న్యాయమూర్తుల దగ్గర నుంచి ఇతర వ్యక్తుల కుటుంబాల వరకు అందరినీ దూషిస్తూ అదే భావ ప్రకటనా స్వేచ్చ అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఇతరుల్ని తిట్టడం భావ ప్రకటనా స్వేచ్చ కాదని పోలీసులు జైళ్లకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల ప్రత్యేకమైన ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ‘‘అసత్య ప్రచారాలు, దూషణలకు చెక్ పెడదాం’’ అని నినాదాలను ఈ ఫ్లెక్సీల్లో పెట్టారు. ‘‘చెడు విషయాలు పోస్ట్ చేయవద్దు.. నైతికంగా పతనం కావొద్దు’’ అని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం అంటూ ఫ్లెక్సీలు, హోర్డింగులు ద్వారా చైతన్యం తెచ్చేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed