- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
PM Modi in Hyderabad : తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోడీ
దిశ, వెబ్‌డెస్క్: భారీ సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ తెలుగులో మాట్లాడారు. ‘ప్రియమైన సోదర, సోదరీ మణులరా మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్ట్‌లను ఈ రోజు ప్రారంభించుకున్నామన్నారు. భాగ్యలక్ష్మీ టెంపుల్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వందే భారత్ రైలు ప్రారంభించుకున్నామన్నారు. ఏపీ - తెలంగాణకు మరో వందే భారత్ రైలు ప్రారంభించుకున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉందన్నారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నారో ఆ ఆకాంక్షలను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటు, నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం మరిచిపోలేనిదన్నారు. 70 కిలో మీటర్ల మేర నగరంలో మెట్రో సేవలను అందిస్తున్నామన్నారు. నగరంలో ఎంఎంటీఎస్ సేవలను పెంచుకుంటున్నామన్నారు. ఇందుకోసం బడ్జెట్ లో అదనంగా నిధులు కేటాయించామన్నారు.
Read More: కేసీఆర్ కుటుంబంపై మోడీ సంచలన వ్యాఖ్యలు