మెట్రోలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి..

by Ramesh N |
మెట్రోలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీకి పలువురు నేతలు తమ సొంత వాహనాల్లో కాకుండా బస్సు, ఆటోలో వచ్చి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు ఇటీవల ఆటోల్లో, కాంగ్రెస్ స్టూడెంట్ లీడర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మెట్రోలో అసెంబ్లీకి వచ్చారు. ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఓ సాధారణ పౌరుడిలా రద్దీగా ఉన్న మెట్రోలో నిలబడి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఎమ్మెల్సీ మెట్రో రైడ్‌కు ఫిదా అయ్యారు.

Advertisement

Next Story