‘మై హీరో’ అంటూ.. త్రివిక్రమ్ డైలాగ్‌తో అదిరిపోయే వీడియో షేర్ చేసిన MLC Kavitha

by sudharani |   ( Updated:2023-12-06 09:35:37.0  )
‘మై హీరో’ అంటూ.. త్రివిక్రమ్ డైలాగ్‌తో అదిరిపోయే వీడియో షేర్ చేసిన MLC Kavitha
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. కానీ, ఇప్పటికే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అధికార భారత రాష్ట్ర సమితికి నిరాశ కలిగించింది. మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తామనుకున్న బీఆర్‌ఎస్ ఆశలు నీరుగారుస్తూ.. ఓటమి తప్పదన్న సంకేతాలు పంపారు. అయితే.. ఒకటి రెండు తప్ప దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అధికారం కాంగ్రెస్‌దే అని ఫలితాలు విడుదల చేశాయి. ఏదేమైనప్పటికీ ఈసారి అధికారం ఏ పార్టీ దక్కించుకోనుందో తెలియాలంటే రేపటి (డిసెంబర్ 3) వరకు వేచి చూడాల్సి ఉంది.

ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని, తామే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత తన X ఖాతాలో ఓ ఎమోషనల్ ట్వీట్ షేర్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన డైలాగ్స్‌తో తన తండ్రీ కేసీఆర్ వీడియోను పంచుకుంది. ‘My Hero’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story