- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం.. మరోసారి సుప్రీంకోర్టుకు..
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులపై మరోసారి ఎమ్మెల్సీ కవిత న్యాయస్థానాల తలుపు తడుతున్నారు. గురువారం ఈడీ జారీ చేసిన నోటీసులపై సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించనున్నారు. విచారణకు రావాల్సిందిగా ఈడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు సుప్రీంలో అదనపు పిటిషన్ దాఖలు చేసేందుకు కవిత తరపు లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
లిక్కర్ కేసు దర్యాప్తు, నోటీసుల విషయంలో గతంలోనే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరోసారి తనకు నోటీసులు ఇవ్వడాన్ని కవిత సవాల్ చేయనున్నారు. రేపు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణకు రానుంది. అయితే శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ జారీ చేసిన నోటీసులపై కవిత ఇప్పటికే స్పందించారు. రాజకీయ కక్షలో భాగంగానే నోటీసులు వచ్చాయని, అవి మోదీ నోటీసులుగా ఆమె పేర్కొన్నారు. ఈ నోటీసులను పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని లైట్ తీసుకున్నారు. నోటీసులను తమ పార్టీ లీగల్ టీమ్ చూసుకుంటుందని, లీగల్ టీమ్ సలహా మేరకు ముందుకెళ్తానన్నారు.